బైక్‌లు ఢీకొని ఓ వ్యక్తికి గాయాలు

బైక్‌లు ఢీకొని ఓ వ్యక్తికి గాయాలు

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఢీకొన్న బైక్‌లు రోడ్డుమధ్యలో పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. స్థానికులు స్పందించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. భారీగా వాహనాల రద్దీ ఉన్నప్పటికీ పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.