శ్రీవారికి కోటి రూపాయల వజ్రాలతో యజ్ఞోపవీతం

శ్రీవారికి కోటి రూపాయల వజ్రాలతో యజ్ఞోపవీతం

AP: తిరుమల శ్రీవారికి బంగారం, వజ్రాలతో చేసిన యజ్ఞోపవీతాన్ని నిలోఫర్ కేఫ్ యజమాని బాబురావు సమర్పించారు. దాదాపు కిలో బంగారం, రూ.కోటి వజ్రాలతో చేయించిన యజ్ఞోపవీతాన్ని టీటీడీకి అందజేశారు. అయితే గతంలో బాబురావు దర్శనానికి వెళ్లినప్పుడు యజ్ఞోపవీతం ఇస్తావా అని శ్రీవారు అడిగినట్లు అనిపించిందని, అందుకే సమర్పించినట్లు చెప్పారు.