వివాహిత అదృశ్యంపై కేసు నమోదు: SI

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు: SI

NDL: మహానంది మండలం అల్లినగరం గ్రామానికి చెందిన శివలలిత అనే వివాహిత మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన తెలిపిన వివరాలు.. శివలలిత తన భర్తతో మనస్పర్థల కారణంగా పుట్టినిళ్లయిన అల్లినగరం గ్రామంలో తల్లి నిమ్మకాయల సాలమ్మ దగ్గరే నాలుగు నెలలుగా ఉంటుందన్నారు. ఈనెల 24 నుంచి ఆమె కనిపించక పోవడంతో తల్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.