బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఇద్దరిపై కేసులు

VZM: భోగాపురం మండలంలోని రెడ్డి కంచెరులో ఎక్సైజ్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక మద్యం దుకాణం వద్ద బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.