భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేయండి: ఎంఏవో

NLR: మనుబోలు మండలంలోని జట్ల కొండూరు, చెర్లోపల్లి గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏఓ వెంకట కృష్ణయ్య రైతులకు పలు సూచనలు చేశారు. పంట పొలాలకు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేయాలని తెలిపారు. పంట వేసిన ప్రతి ఒక్కరూ ఈక్రాప్ నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.