నేడు ఆలయ పునఃప్రతిష్టాపనకు ఎంపీ రాక

KDP: రాజుపాళెం మండలం గోపాయపల్లె గ్రామానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం రానున్నట్లు జడ్పీటీసీ సభ్యురాలు అంజనీకుమారి, సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రామేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమానికి ఎంపీ అవినాష్ రెడ్డి హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనవలసిందిగా కోరారు.