నాగార్జునసాగర్ ఎడమకాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
NLG: జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ గారు నాగార్జునసాగర్ ఎడమ కాలువ 14వ మైలురాయిలో తనిఖీ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో కాలువకు సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలువలో చేపలు పట్టడం, ఈత కొట్టడం, బట్టలు కడగడం నిషేధించబడినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ సందర్భాల్లో డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని కోరారు.