జాలవాడి పాఠశాలను తనిఖీ చేసిన MEO

జాలవాడి పాఠశాలను తనిఖీ చేసిన MEO

KRNL: పెద్దకడబూరు మండలంలోని జాలవాడి ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని SFI మండల కార్యదర్శి విల్సన్ MEOకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో గురువారం MEO ఉస్మాన్ బాషా పాఠశాలను తనిఖీ చేశారు. వంటగది పైకప్పు సరిగా లేదని తక్షణమే మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని HM విక్టోరియాకు సూచించారు.