వారివి విభజన రాజకీయాలు..: ప్రియాంక గాంధీ
ఎన్నికల్లో గెలిచేందుకు NDA ప్రభుత్వం విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఇందుకోసం నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగం, వలసలు వంటి అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే.. ఓట్ల చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. NDA హామీలను చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.