గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై విద్యార్థినిలకు అవగాహన

గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై విద్యార్థినిలకు అవగాహన

KMM: ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే షీ టీమ్‌కు సమాచారం ఇవ్వాలని షీ టీమ్ సభ్యులు శోభ, రుక్మిణి అన్నారు. మంగళవారం ఏన్కూరు మండలం బురదరాఘవాపురం హై స్కూల్ విద్యార్థినీలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాట్సాప్ డీపీలుగా బాలికలు తమ ఫోటోలు పెట్టుకోవద్దని సూచించారు. ఎలాంటి ఇబ్బంది ఉన్న 8712659222 నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.