ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరం, ఇరాక్‌లోని అమెరికా ఎంబసీపై దాడి చేసింది. ఇర్బిల్ విమానాశ్రయం లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ దాడుల్లో దుబాయ్‌లోని ప్రసిద్ధ 23 మెరీనా టవర్ దెబ్బతింది. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన 15 క్షిపణులను కూల్చేశామని, 121 డ్రోన్లలో 119 ధ్వంసం చేసినట్లు దుబాయ్ వెల్లడించింది.