యాడ్స్ చూసి డబ్బు సంపాదించమంటూ మోసం

KDP: ఆన్‌లైన్ యాడ్స్ చూసి డబ్బు సంపాదించండి అని ప్రచారమైన DTE ఎర్నింగ్ యాప్ ద్వారా మదనపల్లె, అంగళ్ల ప్రాంతాల్లో వందల మంది మోసపోయారు. మొదట డబ్బులు రాగా, అనంతరం విత్‌డ్రా ఆగిపోయింది. ఈకేవైసీ పేరుతో అదనంగా రూ. 1380 కడితే ఐడీ యాక్టీవ్ అవుతుదని మెసేజ్‌లు రావడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు.