అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత
దేశవ్యాప్తంగా నెలకొన్న వంటగ్యాస్ కొరత ప్రభావం ఇప్పుడు యూపీలోని పుణ్యక్షేత్రం అయోధ్యను కూడా తాకింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరఫరా దెబ్బతినడంతో సిలిండర్ల కొరత ఏర్పడింది. దీనివల్ల అయోధ్యలో భక్తులకు అందించే ఉచిత ప్రసాదం, అన్నదాన సదుపాయాలను నిర్వాహకులు తాత్కాలికంగా నిలిపివేశారు. గ్యాస్ లభ్యత లేకపోవడంతో ఎక్కువ మోతాదులో వంటలు చేయడం సాధ్యం కాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.