VIDEO: రోడ్డెక్కిన రైతులు.. మాజీ మంత్రి అరెస్ట్

WGL: రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా ''సీఎం డౌన్ డౌన్'' అంటూ రైతులు ధర్నాకు దిగారు. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. భారీ సంఖ్యలో రైతులు ధర్నాలో పాల్గొనడంతో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావును రాయపర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.