రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

KDP: పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఆలీ మౌలాను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.