'మా సమస్యలను తీర్చండి'

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు ఐదో వార్డులో డ్రైనేజీ పై ఐరన్ పరికరాలు ఉండటంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ప్రజలు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఐరన్ పరికరాలు డ్రైనేజీ పై ఉండటం వలన డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయటం లేదు. దీనివలన దుర్వాసన భరించలేక నానా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పేర్కొన్నారు.