తరుణ్ భాస్కర్‌తో విజయ్ మూవీ?

ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో విజయ్ దేవరకొండ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి 'బినామీ' టైటిల్‌ను ఫిక్స్ చేశారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. గతంలో వీరిద్దరి కాంబోలో 'పెళ్లి చూపులు' మూవీ వచ్చిన విషయం తెలిసిందే.