VIDEO: గొల్లపల్లి పీహెచ్సీ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన

ELR: నూజివీడు మండలం గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఆశ వర్కర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మెట్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అనుచితమైన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.