మాతృ మరణాలపై సబ్ కమిటీ సమీక్షా సమావేశం
W.G: భీమవరంలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి ఆధ్వర్యంలో మాతృ మరణాలపై సబ్ కమిటీ సమీక్షా సమావేశం శుక్రవారం జరిగింది. ఈ త్రెమాసికంలో జరిగిన మాతృ మరణాలకు గల కారణాలుపై సంబంధిత అధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.