న్యాయ విచారణకు హాజరైన టీటీడీ ఈవో

తిరుపతి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కమిషన్ దర్యాప్తు మంగళవారం సైతం కొనసాగింది. కలెక్టరేట్‌లో జరిగిన విచారణకు టీటీడీ ఈవో శ్యామలారావు, ఎస్పీ హర్షవర్దన్ రాజు హాజరయ్యారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలు, విధుల కేటాయింపుపై ఈవో, ఎస్పీని కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం.