పలు రకాల హక్కులకు వేలంపాట

NLR: విడవలూరు మండలంలోని రామతీర్థం శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా గురువారం పలు రకాల హక్కులకు వేలంపాటను నిర్వహించారు. టెంకాయలు, తాత్కాలిక అంగళ్లు, తదితర వాటికి ఈరోజు వేలం పాట జరిగింది. గత సంవత్సరం వీటికి రూ.4.12 లక్షలు రాగా ఈ సంవత్సరం 7.52 లక్షల రూపాయలు వచ్చినట్లు ఈవో రామకృష్ణ తెలియజేశారు.