తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

RR: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శంషాబాద్ మాజీ ZPTC నీరటి తన్వీరాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారి మూలవిరాట్టును దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రకాష్ గౌడ్‌కి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని అందజేసి సత్కరించారు.