భారీ మొత్తంలో పాత నోట్లు స్వాధీనం

భారీ మొత్తంలో పాత నోట్లు స్వాధీనం

ఢిల్లీ వాజీపూర్ ప్రాంతంలో అధికారులు పెద్ద మొత్తంలో చెల్లుబాటులో లేని రూ.500, రూ.1000 పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం దాదాపు రూ.3.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు అక్రమ నగదు రవాణాకు ఉంచిన 2 వాహనాలతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.