'ఫ్లవర్ కాదు ఫైర్' డైలాగ్ ముందే చెప్పా: మంచు లక్ష్మి
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లేచింది మహిళాలోకం'. MAR 26న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. 'పుష్ప' సినిమాలో పాపులర్ అయిన 'పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్' అనే డైలాగ్‌ను తానే ముందుగా ఈ సినిమాలో చెప్పానని తెలిపింది. కానీ అది విడుదల కాకముందే సుకుమార్ ఆ డైలాగ్‌ను 'పుష్ప'లో వాడేశారని వెల్లడించింది.