గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
కోనసీమ: ముమ్మిడివరంలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఇవాళ సందర్శించారు. పాఠశాల నీటి అవసరాలు తీరేలా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నీటి ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించారు. రూ.1.10 లక్షల CSR నిధులతో నిర్మాణం చేపట్టిన ఈ పథకం విజయవంతం అయితే మరిన్ని పాఠశాలలకు విస్తరించేందుకు కృషి చేయవచ్చన్నారు.