రేపటి నుంచి ఇంటర్ ప్రత్యేక తరగతులు
KMR: జిల్లాలో ఆశించినంత మేర ఇంటర్ ఫలితాలు రాకపోవడంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ఫెయిలైన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, మే నెలలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు.