'ఆర్టీసీ డిపోలో సౌకర్యాలు పెంచండి'
NRPT: నారాయణపేట ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచాలని బీజేపీ నాయకులు రఘువీర్ యాదవ్ అన్నారు. ఇవాళ డిపో మేనేజర్‌కు ఆయన వినతి పత్రం సమర్పించారు. పుణ్య క్షేత్రాలకు నడిపే బస్సులు రద్దు చేస్తున్నారని తెలిపారు. బస్టాండ్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.