'గురజాల గంజాయికి అడ్డాగా మారింది'

PLD: గురజాల నియోజకవర్గం పేకాట, గంజాయి, మద్యానికి అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి విమర్శించారు. దాచేపల్లి బీసీ బాలుర హాస్టల్లో జరిగిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు.