ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

GDWL: జిల్లాలో వైద్యాధికారుల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు, సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.