VIDEO: నవనీత కృష్ణ అలంకారంలో ఒంటిమిట్ట కోదండ రామయ్య

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ రోజు బుధవారం స్వామివారు నవనీత కృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కేరళ కళాకారుల వాయిద్యాలు మహిళల కోలాటాల నడుమ స్వామి వారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.