సత్తుపల్లిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
KMM: రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఓసీల్లోకీ నీరు చేరింది. దీంతో రెండు ఓసీల్లో 2లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు, 35వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తెలిపారు.