VIDEO: సూచిక బోర్డులు లేక ప్రజలకు ఇబ్బందులు
SRCL: తంగళ్ళపల్లిలోని సెస్ కార్యాలయంలో ధరల సూచిక బోర్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధరల సూచిక బోర్డు లేకపోవడంతో కొందరు అధికారులు ప్రజల వద్ద నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అధికారులు ప్రతి సెస్ కార్యాలయం ముందు ధరల పట్టిక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై సెస్ ఛైర్మన్‌ను వివరణ కోరగా త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.