41 కేసుల్లో ముద్దాయికి శిక్షలు
ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్య చంద్రరావు సమావేశం నిర్వహించారు. కోర్టు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం 41 కేసులలో శిక్షలను విధించినట్లు వివరించారు. కేసులు విచారణ వేగంగా జరగాలంటే సాక్షులను సమయానికి హాజరు చేయడం తప్పనిసరి అని అన్నారు.