ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
BDK: అశ్వాపురం మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కొత్త ఇంటిలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.