'సింగరేణిలో ఉద్యోగ అర్హత వయస్సు పరిమితి పెంచాలి'

భద్రాద్రి: సింగరేణి సంస్థలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో వయస్సు పరిమితిని 45ఏళ్లకు పెంచాలని పట్టణ సీపీఐ కార్యదర్శి సుధాకర్ అన్నారు. మణుగూరులో సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం తర్వాత నిరుద్యోగుల ఆశలు నేటికీ కలగానే మిగిలాయని, ఉద్యోగ అవకాశాల్లో యువతకు 45ఏళ్ల వరకు అవకాశమివ్వాలాని అన్నారు.