మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు లీలాకృష్ణ నివాళి
కోనసీమ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పార్థివ దేహానికి మండపేట జనసేన ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ఘన నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ సీఎంగా రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలందించిన భాస్కరరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.