ఫిబ్రవరి 12న దేశవ్యాప్త ఆందోళన
BDK: కొత్తగూడెం ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్‌లను నిలిపివేయాలని, హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని, కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని కూడా కోరారు.