IPL 2025: RCBకి భారీ షాక్

RCBకి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు దేవదత్ పడిక్కల్ గాయం కారణంగా ఈ సీజన్ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. 'దేవదత్‌ను కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము' అని RCB ప్రకటన విడుదల చేసింది. కాగా, మరోవైపు కెప్టెన్ రజత్ పటీదార్ గాయపడటం జట్టును ఆందోళన పరుస్తోంది.