గాలివాన బీభత్సం.. బొప్పాయి పంట నష్టం

ప్రకాశం: గిద్దలూరు మండలం వెల్లుపల్లెకు చెందిన రైతు కైప లక్ష్మి దేవి రాత్రి గాలివాన కారణంగా బొప్పాయి పంటను నష్టపోయింది. ‘తాను అప్పులు చేసి బొప్పాయి పంట వేశాను. పది రోజులకి పంట చేతికి వస్తుంది. పంట చేతికి వచ్చే సమయానికే పూర్తిగా పంట అంతా పడిపోయి నష్టం వాటిల్లింది. వెంటనే ప్రభుత్వం నష్టపోయిన తమను ఆదుకోవాలి’ అని కోరుకుంటున్నారు.