ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
NRPT: జిల్లా పరిధిలోని కోటకొండ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీ చాలా తక్కువ ఉండటాన్ని గమనించిన కలెక్టర్ అక్కడి డాక్టర్‌ను వివరణ కోరారు. అలాగే ఎన్సీడీ ప్రోగ్రాం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం చేసుకునేలా మహిళలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.