నేడు కలెక్టరేట్‌లో PGRS
కడప కలెక్టరేట్‌లోని సభా భవనంలో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించే వేదికకు కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఇతర అధికారులు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తీసుకురావచ్చని ఆయన వెల్లడించారు.