కాంగ్రెస్ పార్టీలో చేరిన BRS నేతలు
BHPL: టేకుమట్ల మండలం అంకుశాపూర్ మాజీ సర్పంచ్ నందికొండ రాంరెడ్డితో కలిపి 20 మంది BRS నాయకులు సోమవారం రాత్రి మంజూరునగర్ MLA క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. MLA గండ్ర సత్యనారాయణరావు వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీకి ఆకర్షితులమై చేరామని వారు తెలిపారు.