'ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి'
SRCL: ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని తంగళ్ళపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణ అన్నారు. తంగళ్ళపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల మెటీరియల్ క్లస్టర్ల వారీగా పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.