గిడ్డంగి పనులను తనిఖీ చేసిన రాయల

గిడ్డంగి పనులను తనిఖీ చేసిన రాయల

KMM: కమలాపురంలో రూ. 10 కోట్లతో నిర్మిస్తున్న గిడ్డంగి పనులను సోమవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు తనిఖీ చేశారు. 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ గోడౌన్ నిర్మాణ ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో వేగం పెంచేందుకు కార్మికుల సంఖ్యను పెంచాలని సూచించారు.