పీహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

పీహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన గట్టు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, సదుపాయాలను పరిశీలించారు. ​హై రిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించలన్నారు.