కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్‌పై శిక్షణ

కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్‌పై శిక్షణ

అన్నమయ్య: నేరస్థులకు శిక్షే లక్ష్యంగా, బాధితులకు న్యాయమే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీసులకు సూచించారు. ఈ మేరకు కోర్టు కానిస్టేబుళ్లు, మానిటరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించి, కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్‌పై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.