మేము తెచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు: ఎంపీ
HNK: ఆలయ అభివృద్ధికి ఏమి చేయకుండానే ప్రతిపక్షాలు మేము తెచ్చామని చెప్పుకోవడం సిగ్గు చేటని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ.. పార్కులు, ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా వరంగల్‌ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేస్తున్నామన్నారు. అలాగే వరంగల్ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని చెప్పారు.