ఈ ఆలయం 'తెలంగాణ తిరుపతి'గా ప్రసిద్ధి
KMM: ఎర్రుపాలెం(M) జమలాపురంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 'తెలంగాణ తిరుపతి'గా పేరుగాంచింది. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చి వెంకటేశ్వరుడు సతీసమేతంగా గుట్టపై వెలిసినట్లు భక్తుల నమ్మకం. శ్రీరాముడే కలియుగం ప్రారంభంన వెంకటేశ్వరుడిగా వెలిశాడని మరో కథ ప్రచారంలో ఉండగా, ఇక్కడి స్వామి వారి విగ్రహం తిరుమలలోని స్వామి విగ్రహం కంటే పురాతనమైనదని చర్రిత చెప్పుతోంది.