ఉగ్రవాద గ్రూపులకు పాక్ ఇప్పటికీ ఆశ్రయమిస్తోంది: US
పాక్ ఇప్పటికీ ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పిస్తోందని అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ తన నివేదికలో తెలిపింది. ఇవి భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. ఏళ్ల తరబడి సైనిక చర్యలు, విధానపరమైన చర్యలు ఉన్నప్పటికీ ఉగ్రవాద గ్రూపులు పాక్‌లోనే కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని చెప్పింది. ఇవి భారత్‌తో పాటు పాక్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొంది.