చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

WGL: నెక్కొండ మండలంలో గత కొంతకాలంగా వరుస చోరీలకు పాల్పడుతున్న బొల్లికొండ గ్రామానికి చెందిన బానోత్ అజయ్ కుమార్ (26)ను ఇవాళ ఉదయం నెక్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం చోరీలు చేస్తున్నాడని ఎస్సై మహేందర్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 28 తులాల వెండి ఆభరణాలు, ఒక తులం బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.